నిబంధనలు పాటించకుంటే క్రిమినల్ కేసులు
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:23 AM
నాపరాతి గనుల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి నిబంధనలు పాటించకపోతే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు
నాపరాతి గనుల యజమానులతో సీఐ సమావేశంత
కొలిమిగుండ్ల, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): నాపరాతి గనుల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి నిబంధనలు పాటించకపోతే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. సోమవారం నాపరాతి పరిశ్రమల యజమానులు, కార్మికులు, విద్యుత్ అధికారులతో కలిసి సమావేవవ నిర్వహించారు. గనుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలవడంపట్ల సీఐ రమేష్ బాబు, ఏఈ పక్కీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు భూమిపై ఉండకుండా స్థంభాలను ఏర్పాటు చేసుకోవాలని, పనిచేసే సమయంలో చేతికి రబ్బర్ బ్లౌజ్‌లు, కాళ్లకు సేప్టీ బూట్లు, హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వారిపై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి లీజు రద్దు చేస్తామన్నారు. విద్యుత్ సబ్ ఇంజనీర్ లక్ష్మణస్వామి పాల్గొన్నారు.