18 మంది రైతులపై కేసులు
ABN , Publish Date - May 17 , 2026 | 12:08 AM
ఆలూరు బ్రాంచ్ కాలువ పరిధిలో అనుమతులు లేకుం డా పైపులైన్ వేస్తున్న 18 మంది నాన్‌ఆయకట్టు రైతులపై కేసు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహులు శనివారం తెలిపారు
చిప్పగిరి, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆలూరు బ్రాంచ్ కాలువ పరిధిలో అనుమతులు లేకుం డా పైపులైన్ వేస్తున్న 18 మంది నాన్‌ఆయకట్టు రైతులపై కేసు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహులు శనివారం తెలిపారు. అనుమతుల్లేకుండా పైపులైన్ నిర్మిస్తున్న కురువ రాము, సత్యన్న, వెంకటేష్, బాబుతో పాటు మరో 14 మందిపై డీఈ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తుంగభద్ర జలాశయం నుంచి ఏబీసీ కాలువ సాగునీరు రాకపో వడంతో హంద్రీ కాలువ నుంచి నీటిని అందిస్తున్నారు. ఏబీసీ కాలువ పరిధిలో 14,265 ఎకరాలున్నాయని డీఈ చంద్రశేఖర్, ఏఈ శ్రీధర్ తెలిపారు. కొందరు రైతులు నాన్ ఆయకట్టుకు పైపులైన్లు వేసుకుని పంటలు సాగుచేయడం వల్ల సాగునీరు అందించలేక పోతున్నామన్నారు. ఏబీసీ రైతులు అందించిన సమాచాచరం మేరకు చిప్పగిరి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఏబీసీ కాలువ పరిధిలో నాన్ ఆయకట్టు సాగుచేసిన, పైపులైన్లు వేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.