Share News

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:21 AM

వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారి నరసింహ సూచించారు. గురువారం శిల్పానగర్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని మద్యాహ్న సమయంలో బయట తిరగవద్దన్నారు.

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారి నరసింహ సూచించారు. గురువారం శిల్పానగర్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని మద్యాహ్న సమయంలో బయట తిరగవద్దన్నారు. బీపీ, షుగర్‌, రక్తపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. రాష్ట్ర ఎన్జీవోఎస్‌ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, సూపర్‌వైజర్‌ శాంతి ప్రసన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:21 AM