Share News

తీవ్రమైన గుండెపోటుతో కార్డియాక్‌ అరెస్టు

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:07 AM

హార్ట్‌ అటాక్‌ తీవ్రమైనప్పుడు కార్డియాక్‌ అరెస్టు వచ్చే అవకాశం ఉందని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ హెచ్చరించారు.

తీవ్రమైన గుండెపోటుతో కార్డియాక్‌ అరెస్టు
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చిట్టి నరసమ్మ

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): హార్ట్‌ అటాక్‌ తీవ్రమైనప్పుడు కార్డియాక్‌ అరెస్టు వచ్చే అవకాశం ఉందని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ హెచ్చరించారు. బుధవారం కర్నూలు మెడికల్‌ కాలేజీలోని అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో స్కిల్‌ ల్యాబ్‌లో జి. పుల్లారెడ్డి డెంటల్‌ కాలేజీ పీజీలకు రెండు రోజుల కార్డియాక్‌ లైఫ్‌ సపోర్టుపై ప్రత్యేక శిక్షణకు హాజరై ప్రిన్సిపాల్‌ మాట్లాడారు. కార్డియాక్‌ అరెస్టు సమయంలో మొదటి కొద్ది నిమిషాలు అత్యంత కీలకమనీ, ఆ టైంలో సరైన విధానంలో సీపీఆర్‌ డిపిబ్రిలేషన్‌, ఇతర అత్యవసర చర్యలు చేపట్టడం వల్ల ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. ఈసీసీఎల్‌ శిక్షణలు జిల్లా స్థాయిలో వైద్యులకు, యూపీ, పారా మెడికల్‌ నర్సింగ్‌ విద్యార్థులకు దశల వారిగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనస్థీషియా విభాగపు హెచ్‌వోడీ డా. సుధీర్‌ కుమార్‌, ప్రొఫెసర్లు డా. రామశివ నాయక్‌, డా. విశాల, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. అరుణలత పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:07 AM