లారీని ఢీకొట్టిన కారు
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:45 AM
మిత్రులతో కలిసి మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. లారీని వారి కారు ఢీకొనడంతో నలుగురు మిత్రులలో ఒకరు భుజేంద్ర(40) అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
తుగ్గలి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మిత్రులతో కలిసి మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. లారీని వారి కారు ఢీకొనడంతో నలుగురు మిత్రులలో ఒకరు భుజేంద్ర(40) అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మండల పరిధిలోని రాతన సమీపంలో మంత్రాలయం-బెంగుళూరు ప్రధాన రహదారిలో కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపూర్ చెందిన భుజేంద్ర, బాలకృష్ణ, ప్రకాష్, సుదీప్ మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా.. తుగ్గలి మండలం రాతన సమీపంలో ఎదురుగా గుత్తి నుంచి వస్తున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయి అందులోనే నలుగురు ఇరుక్కుపోయారు. అటువైపు వెళ్లున్న వాహనదారులు వారిని బయటకు తీశారు. భుజేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు బాలకృష్ణ, ప్రకాష్, సుదీ్‌పలను పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు తరలించారు. ఈ ముగ్గురిలో సుదీ్‌పకు తీవ్ర గాయాలయ్యాయి. పత్తికొండ రూరల్ సీఐ పెద్దయ్య నాయుడు, తుగ్గలి జొన్నగిరి ఎస్‌ఐలు నరేష్, మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భుజేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రధాన రహదారిలో ప్రమాదం జరగడంతో రోడ్డుకు అడ్డంగా లారీ ఉండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహన రాకపోకలకు కృషి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ పోలీసులు తెలిపారు.