అమరావతే రాష్ట్ర రాజధాని
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:54 PM
: ఆంధ్రప్రదేశ్‌కు రాఽజధాని అమరావతేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మంగళవారం సాయంత్రం యల్లావత్తుల శ్రీరంగాపురం గ్రామాల్లో సీసీ రోడ్డు, మినరల్ వాటర్‌ప్లాంటను ఆమె ప్రారంభించారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ
రుద్రవరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు రాఽజధాని అమరావతేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మంగళవారం సాయంత్రం యల్లావత్తుల శ్రీరంగాపురం గ్రామాల్లో సీసీ రోడ్డు, మినరల్ వాటర్‌ప్లాంటను ఆమె ప్రారంభించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమకు సాగు, తాగునీరు అందించారని, 1వ తేదీనే పింఛన్ ఇస్తున్నారన్నారు. రాయలసీమ జిల్లాల్లో తాగునీటిని అందించి ప్రజల దాహార్తి తీరుస్తున్నామని, అలాగే తెలుగుగంగ, కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు సాగునీరు ఇస్తున్నామన్నారు. తాను ఆళ్లగడ్డ అభిృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడానన్నారు. రూ.8.48 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. యల్లావత్తులలో రూ.25 లక్షలతో శ్రీరంగాపురంలో రూ.9.60ల క్షలతో నిర్మించిన వాటర్‌ప్లాంట్, రూ.10లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచులు చంద్రమోహన్, సుబ్బమ్మ, కన్వీనర్ రంగనాయకులు, క్రిష్ణారెడ్డి, గురుమూర్తి, పుల్లారెడ్డి, ప్రతా్‌పరెడ్డి, కాంతు, సత్యంరాజు, నాగేశ్వర రెడ్డి, చంద్రశేఖర్, సంజీవరాయుడు, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, ఏఈలు కమాల్‌సాహెబ్, సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి పాములేటి తదితరులు పాల్గొన్నారు.