Share News

ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేయించలేరా?

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:06 AM

ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి అధికారులు వచ్చి పోతున్నారే తప్ప.. సభ్యులకు ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయించలేకపోతున్నారని సంఘం సభ్యులు అధికారులను నిలదీశారు.

ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేయించలేరా?
అధికారులను ప్రశ్నిస్తున్న సంఘం సభ్యులు

సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీసిన సభ్యులు

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి అధికారులు వచ్చి పోతున్నారే తప్ప.. సభ్యులకు ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయించలేకపోతున్నారని సంఘం సభ్యులు అధికారులను నిలదీశారు. పట్టణంలో బుధవారం వైడబ్ల్యూసీఎస్‌ సర్వసభ్య సమావేశం సంఘం ప్రత్యేక అధికారిణి, ఆదోని ఆర్డీఓ అరుణాదేవి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి కర్నూలు ఏడీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ యారన్‌(నూలు) తీసుకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సర్గిగా ఉండటం లేదని, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు. అలాగే గతంలో సభ్యులకు హెచ్చ మురవణి దగ్గర 2 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చారని, ఇప్పటి వరకు స్థలాలు మా పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఈ విషయంపై ప్రశ్నించినందుకు పోలీసులతో మా నోళ్లు నొక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లస్థలాలు రిజిస్ట్రేషనులు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మెడికల్‌ బిల్లు పెంచాలని కోరారు. త్రిఫ్ట్‌ఫండ్‌, సబ్సిడీ సభ్యులకు ఇవ్వాలని కోరారు. అనంతరం సంఘం ప్రత్యేక అధికారిణి, ఆర్డీఓ అరుణాదేవి మాట్లాడుతూ సభ్యులు కోరిన విధంగా నూలు పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లస్థలాలు రిజిస్ట్రేషన్‌ అయ్యోందుకు అవసరమైన ప్రతిపాదనలను కర్నూలు ఏడీహెచ్‌ ద్వారా చేనేత,జౌళిశాఖ కమిషనర్‌కు తీర్మానం చేసి పంపుతామన్నారు. అలాగే కూలీ రేట్లు 5శాతం నుంచి 20 శాతానికి పెంచుతామమని, మెడికల్‌ బిల్లు సైతం కూలీ రేట్లకు అనుగుణంగా పెంచేందుకు తీర్మానం చేస్తామన్నారు. సంఘం అభివృద్ధికి కలసికట్లుగా పాటుపడదామన్నారు. సీఐ కంబగిరి రాముడు ఆధ్వర్యంలో పట్టణ ఎస్‌ఐ మధుసూదన్‌ రెడ్డి పోలీసు బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అకౌంటెంట్‌ వీరేష్‌, మాజీ డైరెక్టర్లు నాగరాజు, సరోజమ్మ, సుధాకర్‌, నజీర్‌, సభ్యులు, సోసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు..

ఫ సంఘంలోని 588 సభ్యులకు గతంలో హెచ్‌ మురవణి దగ్గర ఇచ్చిన 18.98 ఎకరాలు భూమిని రివైజ్డ్‌ లేఅవుట్‌ వేయించిన తరువాత రెండు సెంట్ల ప్రకారం డైరెక్టర్‌ ఆఫ్‌ కంట్రీప్లానింగ్‌ అమరావతికి పంపుటంతో పాటు సభ్యుల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయుటకు చేనేత, జౌళిశాఖ కమిషనర్‌కు కర్నూలు ఏడీహెచ్‌ ద్వారా పంపేందుకు సభ్యులు తీర్మానం చేశారు.

సంఘానికి సంబందించిన రెండు ఎకరాల భూమిని ఓ పాఠశాలకు 15 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు తీర్మానం చేశారు.

డిజైనర్‌ హోదా తగ్గింపు తోపాటు వేతనం తగ్గించాలని సభ్యులు తీర్మాణం చేశారు.

సంఘం కార్యాలయంలో సభ్యులకు నూలు పంపిణీ సకాలంలో సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తీర్మాణం చేశారు. వీటితో పాటు అజెండాలో పెట్టిన ఆర్థికలావాదేవీలు

Updated Date - Oct 01 , 2026 | 12:06 AM