Share News

వంకను ఆక్రమించి వెంచర్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:26 AM

మండలంలోని ఉడుములపాడు వందకను ఆక్రమించి, కొందరు వెంచర్‌ వేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

వంకను ఆక్రమించి వెంచర్‌
ఉడుములపాడులో వంకను ఆక్రమించి వేసిన లే అవుట్‌

మ్మెల్యే కోట్ల ఆదేశంతో పాట్లు వేయకుండా అడ్డుకున్న తహసీల్దార్‌

డోన్‌ టౌన్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉడుములపాడు వందకను ఆక్రమించి, కొందరు వెంచర్‌ వేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వంక ద్వారానే చెరువుకు వర్షపు నీరు చేరుతుందని, సర్వే.నెంబర్లు 316, 317, 273లో ఉండే వాగును కొందరు స్వార్థపరులు 70 సెంట్లను ఆక్రమించి ప్లాట్ల రూపంలో విక్రయించేందుకు యత్నిస్తున్నారన్నారు. వంక పూడిపోతే భారీ వర్షాలు కురిస్తే సమీప నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ఇళ్లు, వ్యవసాయ భూములు, ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పందించి, వంకను కాపాడాలని నీటి సంఘం అధ్యక్షుడు నాగభూషణం గౌడు, మాజీ సర్పంచ్‌ ఆదినారాయణ, టీడీపీ నాయకుడు లక్ష్మీనారాయణ, మహే్‌షగౌడు, కోయలకొండ రాజుతో పాటు ఉడుములపాడు గ్రామస్థులు 50 మంది ఎమ్మెల్యే కోట్ల గురువారం ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే విచారణ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిరు. తహసీల్దార్‌, వీఆర్వోలు పరిశీలించి అక్కడ పనులను నిలిపివేశారు. అక్రమంగా లేఅవుట్లు వేసినా, వంకను ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jul 17 , 2026 | 12:26 AM