Share News

చెంచుల చదువుపై క్యాంపెయిన్‌

ABN , Publish Date - May 23 , 2026 | 11:54 PM

రానున్న విద్యా సంవత్సరంలో చెంచు బాలబాలికలకు సంపూర్ణ విద్యాభ్యాసాన్ని అందించడానికి డోర్‌ టు డోర్‌ క్యాంపైన్‌ చేపట్టినట్లు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు వెల్లడించారు.

చెంచుల చదువుపై క్యాంపెయిన్‌
ఐటీడీఏ కార్యాలయంలో సమావేశమైన అధికారులు

శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు

శ్రీశైలం, మే 23 (ఆంధ్రజ్యోతి): రానున్న విద్యా సంవత్సరంలో చెంచు బాలబాలికలకు సంపూర్ణ విద్యాభ్యాసాన్ని అందించడానికి డోర్‌ టు డోర్‌ క్యాంపైన్‌ చేపట్టినట్లు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు వెల్లడించారు. శనివారం ప్రధాన కార్యాలయం నుంచి జరిగిన జూమ్‌ మీటింగ్‌లో నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాలలో ఉన్న గురుకుల విద్యాసంస్థలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యాభ్యాసాన్ని అందించడంతోపాటు 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రణాళికలను ఆచరణలో ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులను సమన్వయపరుస్తూ ఐవీఆర్‌ఎస్‌ కార్యక్రమంతోపాటు గడిచిన 10వ తరగతి ఫలితాల్లో సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్‌ ఏపీవో రామాంజనేయులు, మూడు జిల్లాల డీటీడబ్ల్యూవోలు, ఈఈ సృజన, ఐటిడీఏ ఓ అండ్‌ ఎం, పీఆర్‌వో సీమోన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 11:54 PM