ప్రశాంతంగా నీట్
ABN , Publish Date - May 03 , 2026 | 11:01 PM
దేశ వ్యాప్తంగా మెడికల్ కళాశా లలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యుజీ ప్రవేశ పరీక్ష ఆది వారం జరిగింది.
జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు..
4807 మంది అభ్యర్థులు హాజరు
121 మంది గైర్హాజర్
97.54 శాతం హాజరు నమోదు
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు ఎడ్యుకేషన్, మే 3 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా మెడికల్ కళాశా లలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యుజీ ప్రవేశ పరీక్ష ఆది వారం జరిగింది. మండే ఎండ వేడిమికి తోడు పరీక్ష టెన్షన్‌తో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కర్నూలు జిల్లాలో నీట్ యుజీ ప్రవేశ పరీక్షకు 4,928 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 4807 మంది హాజరయ్యారు. 121 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో జిల్లాలో 97.54 శాతం హాజరు నమోదైంది. నీట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి కర్నూలు నీట్ పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొంత గ్రామాల నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో తలప్రాణం తోకకు వచ్చినట్లయింది. కొంత మంది విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో అద్దెకు తీసుకుని కర్నూలు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో ఆ ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. ఉదయం 11.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. ఒక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించకూడదనే నిబంధనతో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల మెయిన్ గేటు వద్ద పరీక్ష నిర్వహకులు చెక్ చేసి లోపలికి అనుమతించారు. విద్యార్థులకు సంబంధించిన చేతి గడియారాలు, విద్యార్థినులకు బంగారు నగలు చెవిదుద్దులను సెక్యూరిటీ సిబ్బంది గేటు బయటనే తొలగించి కేంద్రంలోనికి అనుమతించారు. కర్నూలు నగరంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్ యూజీ పరీక్షను సిటీ కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో నిర్వహించారు. నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరగడంతో విద్యార్థులు, అటు నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాల, పాత నగరంలోని ప్రభుత్వ మైనార్టీ జూనియర్ కళాశాల, కేవీఆర్ ప్రభుత్వ కళాశాల, ఏ. క్యాంపులోని ఇందిరాగాంధీ మెమోరియల్ హై స్కూల్, రాయలసీమ యూనివర్సిటీ నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ ఫర్ మెన్ డిగ్రీ కాలేజీలోని పరీక్ష కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ నూరుల్ ఖమర్ పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణ సజావుగా, పార దర్శకంగా నిబం ధనలకు అనుగుణంగా కొనసాగిందన్నారు. పరీక్ష నిర్వహణ క్షేత్ర స్థాయిలో పరిశీలిం చినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామన్నారు. బయోమెట్రి నమోదు, హాల్ టికెట్ తనిఖీలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ వంటి విధా నాలు సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలి పారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించా మన్నారు. పరీక్ష సమయంలో అక్రమాలు చోటు చేసుకో కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం పరీక్ష ప్రక్రియలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పరీ క్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.