Share News

మండే ఎండలు

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:19 PM

ఉమ్మడి జిల్లాల్లో సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది.

 మండే ఎండలు

నంద్యాల జిల్లా సంజామలలో 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు జిల్లా గూడూరులో 43.0 నమోదు

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాల్లో సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా సంజామలలో 44.0, కర్నూలు జిల్లా గూడూరులో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలో కోడుమూరు 42.7, మంత్రాలయం 42.5, కల్లూరు 41.9, హాలహర్వి 41.8, ఎమ్మిగనూరు, చిప్పగిరి 41.7, సి.బెళగల్‌, దేవనకొండ 41.6, కోసిగి 41.5, కర్నూలు రూరల్‌ 41.3, కర్నూలు నగరం, క్రిష్ణగిరి, పత్తికొండ, కౌతాళం 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్లలో 43.3, రుద్రవరం 42.4, గోస్పాడు, నంద్యాలరూరల్‌ 42.7, పాణ్యం 42.6, చాగలమర్రి 42.5, కొలిమిగుండ్ల, రుద్రవరం 42.4, అవుకు 42.3, జూపాడుబంగ్లా, కొత్తపల్లె 42.1, పాములపాడు, మిడ్తూరు 41.3, పగిడ్యాల 41.1, శిరువెళ్ల 41.0, ప్యాపిలి 40.8, వెలుగోడు 40.5, గడివేముల 40.7, బండిఆత్మకూరు 40.5, బేతంచర్ల 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గతేడాది కంటే అధికంగా ఎండలు

గత ఏడాది కర్నూలు నగరంలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. నంద్యాల జిల్లాలో పాణ్యం మండలం గోనవరంలో 44.0, గోస్పాడులో 47.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా ఏ ఏడాది ఏప్రిల్‌ రెండో వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Updated Date - Apr 13 , 2026 | 11:19 PM