అసంపూర్తి భవనాలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:33 AM
: గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన సచివాలయ వ్యవస్థకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా అనేక గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
బెలుంలో పూర్తికాని సచివాలయం, పునాదులకే పరిమితమైన రైతు సేవా కేంద్రం
కొలిమిగుండ్ల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన సచివాలయ వ్యవస్థకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా అనేక గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
బిల్లులు చెల్లించకపోవడమే కారణం..
పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. మండలంలో 16 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించ తలపెట్టగా, అనేక గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. బెలుం గ్రామంలో సచివాలయ భవనం పనులు పూర్తికాలేదు, మరోవైపు రైతు సేవా కేంద్రం భవనం పునాదులకే పరిమితమైంది. ఇక అంకిరెడ్డిపల్లె, తోళ్లమడుగు, తిమ్మనాయినిపేట, గొర్విమానుపల్లె గ్రామాల్లో సచివాలయ భవనాలు పూర్తికాలేదు. భవనాలు లేక సచివాలయ ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి భవనాలను పూర్తిచేయాలని ప్రజలు, ఉద్యోగులు కోరుతున్నారు