హంద్రీ నీవాపై బ్రిడ్జి నిర్మించండి
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:07 AM
రైతుల సౌకర్యార్థం హంద్రీ నీవా ప్రధాన కాలువ 112 బ్లాక్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని హంద్రీ నీవా ఉన్నతాధికారులకు దూదేకొండ రైతులు విన్నవించారు.
అధికారులను కోరిన రైతులు
పత్తికొండ టౌన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రైతుల సౌకర్యార్థం హంద్రీ నీవా ప్రధాన కాలువ 112 బ్లాక్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని హంద్రీ నీవా ఉన్నతాధికారులకు దూదేకొండ రైతులు విన్నవించారు. గురువారం హంద్రీ నీవా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మన్ననాయక్, కేశవరెడ్డి హంద్రీనీవా కాలువ పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా రైతులు వారిని కలిసి సమస్యలను విన్నవించారు. పంట దిగుబడులు తీసుకొచ్చే టైంలో బ్రిడ్జి లేకపోవడంతో 112వ బ్లాక్ వద్ద ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ఎద్దులబండ్లు కాలువలో పడి ప్రమాదాలు జరిగిన ఘట నలు కూడా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మెంబర్ ఈరన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, రైతులు వడ్డే రంగస్వామి, రామదాసు, సంజన్న, శంకర్ పాల్గొన్నారు.