భూముల వ్యవహారంపై స్పష్టత తీసుకురండి
ABN , Publish Date - May 16 , 2026 | 11:16 PM
పట్టణంలోని ఆటోనగర్ భూముల వ్యవహారా నికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేసి స్పష్టత తీసుకురావాలని కలెక్టర్ రాజకు మారి సంబంధిత అఽధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆటోనగర్ భూముల వ్యవహారా నికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేసి స్పష్టత తీసుకురావాలని కలెక్టర్ రాజకు మారి సంబంధిత అఽధికారులను ఆదేశించారు. శనివారం ఆమె తమ ఛాంబర్‌లో ఆటోనగర్ భూముల విషయంపై సమీక్ష నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆటోనగర్‌కు సంబంధించిన భూముల మొత్తం విస్తీర్ణం, ప్లాట్ల కేటాయింపులు, యాజమాన్య హక్కులు, రిజిస్ర్టేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించి స్పష్టమైన నివేదికలు సమర్పించాలన్నారు.
విద్యార్థుల నమోదు శాతం పెంచాలి
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించి విద్యా ర్థుల నమోదు శాతాన్ని పెంచాలని కలెక్టర్ రాజకుమారి విద్యాశా ఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో బడి పిలుస్తోంది కార్యక్రమం కింద అడ్మిషన్లు, ట్రాన్సిషన్ శాతం, రీ-అడ్మిషన్లపై కలెక్టర్ సమీక్షించారు.
విద్యార్థులకు ఉచిత కోచింగ్
జిల్లాలో ముస్లిం పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశా లను కల్పించేందుకు ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్న తాలీమ్ ఏ హునర్ ఎడ్యుకేషన్ మిషన్ టాలెంట్ టెస్ట్ పరీక్షకు సంబంఽ దించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుకలెక్టర్ రాజకుమారి తెలి పారు. నంద్యాల జిల్లా నుంచి దాదాపు 750 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారన్నారు.
జూన్ 30లోపు పూర్తి చేయాలి
జిల్లాలో చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమ పనులను నిర్దేశిత గడువు జూన్ 30లోగా పూర్తిచేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఆమె తమఛాంబర్ నుంచి ‘జలధార-జలహారతి’ పురోగతి పను లపై ఎంపీడీవోలు, ఇం జనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొత్తం 2223 పనులు మంజూరు కాగా ఇప్పటికే 2005 పనులు గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నాయన్నారు.