విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: డీఈవో
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:54 PM
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో జనార్దన్ రెడ్డి అన్నారు. మిడుతూరు లోని జడ్పీ హైస్కూల్‌ను బుధవారం ఆయన పరిశీలించారు.
మిడుతూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో జనార్దన్ రెడ్డి అన్నారు. మిడుతూరు లోని జడ్పీ హైస్కూల్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ముందు గా ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో క్రమం తప్పకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. అనం తరం పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో మల్లికార్జున నాయక్, మిడుతూరు, చెరుకుచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు సాయితిమ్మయ్య, ఉమాశంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.