Share News

చదువుతో ఉజ్వల భవిష్యత్తు

ABN , Publish Date - May 02 , 2026 | 10:30 PM

చదువుతోనే పిల్ల లకు ఉజ్వల భవిష్యత్తు అని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పేర్కొన్నారు. సారా ని ర్మూలనలో భాగంగా శనివారం పాణ్యం ఇందిరానగర్‌లో ఏర్పా టుచేసిన నవోదయం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

చదువుతో ఉజ్వల భవిష్యత్తు
మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

సారాతో జీవితాలు మారవు

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

పాణ్యం/ నంద్యాల క్రైం, మే 2 (ఆంధ్రజ్యోతి): చదువుతోనే పిల్ల లకు ఉజ్వల భవిష్యత్తు అని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పేర్కొన్నారు. సారా ని ర్మూలనలో భాగంగా శనివారం పాణ్యం ఇందిరానగర్‌లో ఏర్పా టుచేసిన నవోదయం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువు నేర్చు కోవడం దొంగత నమంత కష్టం కాదని, చెంచులు తమ పిల్లలను పాఠశాలకు పంపి వారి జీవితాలను మార్చుకోవాలని హితవు పలికారు. సారాతో జీవితాలు మారవని అన్నారు. కాలనీలో అర్హులైన యువకులకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి కల్పించి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. చెంచులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిం చుకోవ చ్చన్నారు. ఎక్సైజ్‌ సీఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ పది శాతం కుటుం బాలు మాత్రమే సారాపై ఆధారపడి జీవిస్తున్నాయని, వాటిని మానితే జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌ మాట్లా డు తూ కాల నీలో జన్‌మన్‌ కింద గృహాలు మంజూరయ్యాయని, గృహాలు నిర్మించు కోలేని చెంచులకు థర్డ్‌పార్టీ ద్వారా నిర్మించామ న్నారు. జిల్లా నైపుణ్యా భివృద్ధి సంస్థ అధికారి అశోక్‌కుమార్‌ మాట్టాడుతూ పదవ తర గతి చదివిన యువతకు ఉచితంగా భోజన సౌక ర్యంతోపాటు ఉచి తంగా నివాస, నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. కార్యక్ర మం లో ఆర్‌ఐ రాము, సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంఈవో కోటయ్య, ఎస్‌ఐలు నరేంద్రకుమార్‌రెడ్డి, శివప్రసాద్‌, ఏఎస్‌ఐ రఫీక్‌, మాజీ జెడ్పీటీసీ నారాయ ణమ్మ, మాజీ ఉపసర్పంచి రమణమూర్తి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 10:30 PM