Share News

తల్లి పాలు బిడ్డకు శ్రేయస్కరం

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:32 PM

పుట్టిన వెంటనే తల్లిపాలు తాపడం బిడ్డకు శ్రేయస్కరమని కేఎంసీ (కర్నూలు మెడికల్‌ కాలేజీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినర సమ్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

తల్లి పాలు బిడ్డకు శ్రేయస్కరం
మాట్లాడుతున్న డా.కే.వెంకటేశ్వర్లు

కర్నూలు జీజీహెచ్‌లో తల్లి పాల వారోత్సవాలు

కర్నూలు హాస్పిటల్‌, ఆగష్టు 1 (ఆంధ్రజ్యోతి): పుట్టిన వెంటనే తల్లిపాలు తాపడం బిడ్డకు శ్రేయస్కరమని కేఎంసీ (కర్నూలు మెడికల్‌ కాలేజీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినర సమ్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రసూతి విభాగంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణులు, బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. ప్రతి తల్లి పాల ప్రాముఖ్యతను గుర్తించి శిశువుకు అందించాలని పిలుపునిచ్చారు. ప్రసూతి విభాగపు హెచ్‌వోడీ డా.సిగ్దా మాట్లాడుతూ ప్రసవం జరిగిన వెంటనే బిడ్డలకు ముర్రుపాలు తాగిస్తే రోగ నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవితాంతం కాపాడుతాయన్నారు. సీఎస్‌ఆర్‌ఎంవో డా.పి.పద్మజ, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డా.పద్మజ, ఆర్‌ఎంవో టీసీహెచ్‌ వెంకటరమణ, గైనిక్‌ వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 11:32 PM