Share News

ఎద్దులు భళా..!

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:21 AM

ఏకధాటిగా 16 ఎకరాలలో పత్తిపంట గుంటుక పాసి భళా అనిపించాయి వెలమకూరు గ్రామానికి చెందిన పాండుకు చెందిన ఎద్దులు.

ఎద్దులు భళా..!
ఎద్దుల ఉరేగింపులో పాల్గొన్న మహిళలు

ఏకధాటిగా 16 ఎకరాలు గుంటక పాసి రికార్డు

దేవనకొండ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఏకధాటిగా 16 ఎకరాలలో పత్తిపంట గుంటుక పాసి భళా అనిపించాయి కర్నూలు జిల్లాలోని వెలమకూరు గ్రామానికి చెందిన పాండుకు చెందిన ఎద్దులు. సాధారణంగా ఐదు ఎకరాలు గుంటక పాసేందుకే ఎద్దులు అలసిపోతాయి. అయితే పాండుకు చెందిన ఎద్దులు గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఏకదాటిగా 16 ఎకరాల పత్తిపంట గుంటక పాసీ ఔరా అనిపించాయి. దీంతో ఎద్దులకు ఊరేగింపు నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ భాస్కర్‌, గోవిందురాజులు, శేఖర్‌, నర్సన్న, చాంద్‌బాషా, రాకేష్‌, మల్లి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:25 AM