శ్రీగిరికి బ్రహ్మోత్సవ శోభ
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:13 PM
శ్రీగిరి క్షేత్రమంతా విద్యుద్దీపకాంతులతో శోభాయమానంగా విరాజిల్లుతోంది.
నేడు యాగశాల ప్రవేశంతో సంక్రాంతి వేడుకలు
ఏడు రోజులపాటు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు
ధ్వజారోహణతో సకల దేవతలకు ఆహ్వానం
ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలు నిలుపుదల
శ్రీశైలం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : శ్రీగిరి క్షేత్రమంతా విద్యుద్దీపకాంతులతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. సంక్రాంతి సెలవులకు స్వామి, అమ్మవార్ల దర ్శనాలకు భక్తులు ప్రత్యేకంగా శ్రీశైలానికి వస్తున్నారు. మకర సంక్రమణ పుణ్యకా లాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఉదయం యాగశాల ప్రవేశంతో పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్స వాలలో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు చతుర్వేద పఠనం, బ్రహ్మోత్సవ మహాసంకల్పం, గణపతి పూజ, స్వస్తిపుణ్యహవాచనం, చండీశ్వరునికి విశేష పూజలు, కంకణధారణ, రుత్విగరణం, వాస్తుపూజ, వాస్తుహోమం, అఖండ దీపారాధన, మండపారాధనలు, కలశస్థాపన, జపాను ష్టానాలు, పారాయణలు, పంచావరణార్చనలు జరిపించేందుకు సన్నాహాలు చేసినట్లు తెలిపారు. సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజపట ఆవిష్కరణతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆర్జిత సేవలు నిలుపుదల
బ్రహ్మోత్సవాల సందర్భంగా 18వతేదీ వరకు స్వామి, అమ్మవార్ల ప్రత్యక్ష, పరోక్ష ఆర్జితసేవలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. మందస్తుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులకు గర్భాలయ స్పర్శ దర్శనాలు, అభిషేకాలు యథావిధిగా ఉంటాయని తెలిపారు. - ఈవో శ్రీనివాసరావు
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు
12-01-2026: ధ్వజారోహణ
13-01-2026: భృంగి వాహనసేవ
14-01-2026: కైలాసవాహన సేవ
15-01-2026: నందివాహన సేవ, కళ్యాణం
16-01-2026: గోపూజ, రావణవాహన సేవ
17-01-2026: పూర్ణాహుతి, త్రిశూలస్నానం,
ధ్వజావరోహణ
18-01-2026: అశ్వవాహన సేవ,
పుష్పోత్సవం, శయనోత్సవం