Share News

సబ్‌ జైళ్లలో బోర్డ్‌ ఆఫ్‌ విజిటర్స్‌ బృందం ఏర్పాటు

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:29 PM

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు, నంద్యాల సబ్‌జైళ్లలోని ఖైదీల సమస్యల పరిష్కారం కోసం బోర్డ్‌ ఆఫ్‌ విజిటర్స్‌ బృందం ఏర్పాటు చేసినట్లు లీగల్‌సెల్‌ చైర్మన్‌ అమ్మన్నరాజా తెలిపారు.

సబ్‌ జైళ్లలో బోర్డ్‌ ఆఫ్‌ విజిటర్స్‌ బృందం ఏర్పాటు

లీగల్‌ సెల్‌ చైర్మన్‌ అమ్మన్న రాజా

నంద్యాల క్రైం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు, నంద్యాల సబ్‌జైళ్లలోని ఖైదీల సమస్యల పరిష్కారం కోసం బోర్డ్‌ ఆఫ్‌ విజిటర్స్‌ బృందం ఏర్పాటు చేసినట్లు లీగల్‌సెల్‌ చైర్మన్‌ అమ్మన్నరాజా తెలిపారు. గురువారం ఆయా శాఖలకు చెందిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యుల్లో కలెక్టర్‌, ఎస్పీ, డీఎం హెచ్‌వో, పీడబ్ల్యూడీ ఈఈ, డీఈవో, సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, ఎంప్లాయిమెంట్‌ అధికారి, అగ్రికల్చరల్‌, ఇండస్ట్రియల్‌ ఆఫీసర్లను నియమించామన్నారు. కమిటీ సభ్యులు ప్రతినెలా నంద్యాల జిల్లాలోని సబ్‌జైళ్లను తనిఖీ చేస్తూ ఖైదీల సమస్యలు, సంక్షేమం. న్యాయ పరంగా విద్యా, ఆరోగ్య పర మైన సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఆర్‌డీవో విశ్వనాథ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, డీఈవో జనార్థన్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ గురుప్రసాద్‌రెడ్డి లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 11:29 PM