Share News

అధిక రక్తపోటు దీర్ఘకాలిక సమస్య

ABN , Publish Date - May 19 , 2026 | 12:31 AM

అధిక రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌) దీర్ఘకాలిక సమస్య అని జిల్లా టీబీ ఆఫీసర్‌ డా.ఎల్‌. భాస్కర్‌ అన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

అధిక రక్తపోటు దీర్ఘకాలిక సమస్య
ర్యాలీలో పాల్గొన్న జిల్లా టీబీ ఆపీసర్‌, వైద్యులు

కర్నూలు హాస్పిటల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): అధిక రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌) దీర్ఘకాలిక సమస్య అని జిల్లా టీబీ ఆఫీసర్‌ డా.ఎల్‌. భాస్కర్‌ అన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అధిక రక్తపోటు ఓ సైలెంట్‌ కిల్లర్‌ అని, ఈ వ్యాధి వల్ల గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతింటాయని అన్నారు. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎ్‌సకే జిల్లా కోఆర్డినేటర్‌ డా. మహేశ్వరప్రసాద్‌, ఎఫ్‌డీపీ నోడల్‌ ఆఫీసర్‌ డా. విశ్వేశ్వరరెడ్డి, జిల్లా గణాంక అధికారి హేమసుందర్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి ఎన్‌.ప్రకా్‌షరాజ్‌, హెచ్‌ఈఈవో బాబా ఫకృద్దీన్‌, డిప్యూటీ డెమో షఫీ వున్నీసా భేగం పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:31 AM