Share News

బీజేపీకి పతనం తప్పదు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:19 AM

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లేబర్‌ కోడ్ల అమలుతో దేశంలో బీజేపీ పతనం తప్పదని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

బీజేపీకి పతనం తప్పదు
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు

వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట నిరస

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లేబర్‌ కోడ్ల అమలుతో దేశంలో బీజేపీ పతనం తప్పదని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. బుధవారం లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన బ్లాక్‌డేలో భాగంగా బుధవారం కర్నూలు కలెక్టరేట్‌ కార్యాల యం ముందు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐయుటీ యూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు నల్లజెండాలు పట్టుకుని నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి బి.వెంకటేష్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ కాలం నుంచి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేయడం బీజేపీ ప్రభుత్వానికి తగదన్నారు. కార్యక్ర మంలో సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్య దర్శి ఎస్‌.మునెప్ప, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లెనినబాబు, నాయకులు నాగన్న, తిరుపాలు, జి.చంద్రశేఖర్‌, ఎస్‌.రంజాబీ, ఏ.ఈశ్వర్‌, మనోహర్‌, మాణిక్యం, టి.రామాంజనేయులు, ఆర్‌.కృష్ణారెడ్డి, ఈశ్వర్‌, పురుషోత్తం పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:19 AM