Share News

జనన, మరణాల నమోదు తప్పనిసరి

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:57 PM

21 రోజుల్లో జనన, మరణాల నమోదును తప్పనిసరిగా చేయాలని కర్నూలు ప్రభుత్వ సర్వ జన వైద్యశాల సివిల్‌ సర్జన ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ అన్నారు.

జనన, మరణాల నమోదు తప్పనిసరి
మాట్లాడుతున్న సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ

జీజీహెచ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): 21 రోజుల్లో జనన, మరణాల నమోదును తప్పనిసరిగా చేయాలని కర్నూలు ప్రభుత్వ సర్వ జన వైద్యశాల సివిల్‌ సర్జన ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ అన్నారు. బుధ వారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరీ హాలులో జనన, మరణాల సర్టిఫికెట్లపై హెడ్‌ నర్సులు, ఎంఆర్‌టీ సిబ్బందితో సీఎస్‌ఆర్‌ఎం వో సమావేశాన్ని నిర్వహించారు. నర్సింగ్‌ సిబ్బంది వార్డుల నుంచి జనన, మరణాలకు సంబంధించిన 24 గంటలోపు పంపించాలని సీఎస్‌ఆర్‌ఎంవో ఆదేశించారు. 21 రోజుల్లో వివరాలు నమోదు చేయకపోతే అపరాద రుసుం చెల్లించాలన్నారు. జనన, మరణాలకు సంబంధించిన కేషీట్లలో వివరాలు రాయాల్సింది డాక్టర్లు అని, కాజ్‌ ఆఫ్‌ డెత కూడా డాక్టర్లు రాయాలని, వారు రాయకపోతే ఎలా అని కొందరు నర్సెస్‌ యూనియన నేతలు ప్రశ్నించారు. బయోమెడికల్‌ వెస్ట్‌కు సంబంధించి కొన్ని వార్డులకు ప్లాస్టిక్‌ కవర్లు పంపడం లేదని సీఎస్‌ ఆర్‌ఎంవో దృష్టికి హెడ్‌ నర్సులు తీసుకెళ్లారు. ఎంఎనవో, ఎఫ్‌ఎనవోలతో డ్యూటీ చేయించాల్సిన బాధ్యత హెడ్‌నర్సులపై ఉందని నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సావిత్రీబాయి తెలిపా రు. సమావేశంలో గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ శ్రీదేవి పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:57 PM