Share News

బయో మైనింగ్‌ త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:21 AM

నగర శివారులోని గార్గేయపురం డంప్‌ యార్డులో బయో మైనింగ్‌ ప్రక్రియను మార్చి నెల ఆఖరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కాంట్రాక్టర్లను ఆదేశించారు.

బయో మైనింగ్‌ త్వరగా పూర్తి చేయాలి
డంప్‌ యార్డును పరిశీలిస్తున్న పట్టాభిరామ్‌

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన పట్టాభిరామ్‌

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): నగర శివారులోని గార్గేయపురం డంప్‌ యార్డులో బయో మైనింగ్‌ ప్రక్రియను మార్చి నెల ఆఖరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌తో కలిసి గార్గేయపురం డంప్‌ యార్డులో వ్యర్థాల నుంచి విద్యుత ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్న ప్రదేశంలో జరుగుతున్న బయో మైనింగ్‌ పనులను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మున్సిపల్‌ ప్రజారోగ్య జడ్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గార్గేయపురం డంప్‌ యార్డులో ఎంఆర్‌ఎఫ్‌ (మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ) నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జోహరా పురం డంప్‌ యార్డులో బయో మైనింగ్‌ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. ఐఈపీ కార్యకలాపాలు, నిర్మాణ- కూల్చివేత వ్యర్థాల నిర్వ హణ విధానాల అమలుపై పట్టాభీ ఆరా తీశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నారపురెడ్డి, ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య శాఖ ఈఈ గురప్ప యాదవ్‌, కార్యదర్శి నాగరాజు, ఎంఈలు మనోహర్‌ రెడ్డి, గిరిరాజ్‌, ప్రజా రోగ్య అధికారి డా.నాగప్రసాద్‌, డీఈఈ పవన కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:21 AM