పనులు పూర్తయ్యాకే బిల్లులు
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:10 AM
నగరంలో రహదారులు, డ్రైనేజీలకు సంబంధించిన పనులు పూర్తయ్యాకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూన 17(ఆంధ్రజ్యోతి): నగరంలో రహదారులు, డ్రైనేజీలకు సంబంధించిన పనులు పూర్తయ్యాకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. బుధవారం ఆయన టైపిస్ట్ కాలనీ, చంద్రశేఖర్ నగర్ ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ ఆయా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే బిల్లులు చెల్లించామని హెచ్చరించారు. అంతకుముందు జొహరాపురం డంప్‌యార్డులో బయో మైనింగ్ ద్వారా వెలువడిన జీర్ణమైన మట్టి, ఇన్నర్ట్ వ్యర్థాలతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ కూడలి, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్నక్యాంటీనను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఈ మనోహర్‌రెడ్డి, ఏఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జనార్దన, శానిటేషన ఇన్సస్పెక్టర్లు హుస్సేన, కూర్మయ్య, మునిస్వామి ఉన్నారు.