Share News

బైకు దొంగల అరెస్టు

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:27 AM

నగరంలో మోటార్‌ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బైకు దొంగల అరెస్టు
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ విక్రమసింహ

కర్నూలు క్రైం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): నగరంలో మోటార్‌ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మల్లెపోగు చెన్నయ్య, అతని బంధువు (మైనర్‌ బాలుడు) లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. వెల్దుర్తి మండలం కలుగోట్లకు చెందిన కార్తీక్‌ అనే వ్యక్తికి చెందిన మోటారు సైకిల్‌ను మార్కెట్‌ యార్డులో చోరీ చేశారు. అలాగే వెంకటరమణ కాలనీకి చెందిన కార్తిక్‌ అనే మరో యువ కుడికి చెందిన బైక్‌ను చోరీ చేశారు. ఈ రెండు ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కర్నూలు బాపూజీ నగర్‌కు చెందిన మల్లెపోగు చెన్నయ్య అతని బంధువు కలిసి ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.7లక్షలు విలువైన మోటారు సైకిళ్లను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Mar 16 , 2026 | 12:27 AM