హైకోర్టు బెంచ్ కోసం బైక్ ర్యాలీ
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:38 PM
కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు.
విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన న్యాయవాదులు
కర్నూలు లీగల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించి, రాజ్‌విహార్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. చంద్రుడు మాట్లాడుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే హైకోర్టు పర్మనెంట్ బెంచ్‌ను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాది వై. జయరాజు మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం హామీలతో రెండేళ్ల కాలాన్ని గడిపేసిందని, ఇకనైనా న్యాయవాదులను మభ్య పెట్టడాన్ని విరమించి వెంటనే శాశ్వత హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాదులు కపిలేశ్వరయ్య, సి. నాగేంద్రనాథ్, కే. ఓంకార్, డి. వెంకటస్వామి, హనుమంతరెడ్డి, ఎస్. రాజే్‌షబాబు, బార్ అసోసియేషన్ కార్యదర్శి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.