Share News

బీసీలకు పెద్ద పీట

ABN , Publish Date - Sep 01 , 2026 | 10:56 PM

సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి బీసీలకు పదవుల్లో పెద్ద పీట వేశారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు.

బీసీలకు పెద్ద పీట
టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న బీసీ నాయకులు

అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ

బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం

కర్నూలు అర్బన్‌ , సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి బీసీలకు పదవుల్లో పెద్ద పీట వేశారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బొజ్జమ్మ, ఎం. దేవేంద్రప్ప, పార్వతమ్మ, మిన్నప్ప, విక్రమ్‌ సింగ్‌ హాజరయ్యారు. క్రిష్ణమ్మ మాట్లాడుతూ బీసీ జిల్లాగా బలపడిందన్నారు. నారా లోకేశ్‌ నాయకత్వంలో ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే కార్పొరేషన్‌, మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను అత్యధిక స్థానాల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ ఉపకులాలకు చెందని వారిపై ఉందన్నారు. వాల్మీకి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బొజ్జమ్మ మాట్లాడుతూ సభ ఎక్కడ నిర్వహించినా వాల్మీకులను ఎస్టీ జాబితా చేర్చాలంటున్నారు. మాజీ ఎంపీ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ కూటమి పాలనలో స్త్రీశక్తికి పెద్ద పీట వేశారని, రాబోయే ఎన్నికల్లో మహిళలు కూటమి ప్రభుత్వం కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు. బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీసీల ఆధ్వర్యంలో సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వం బీసీలకు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అంశాలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నియోజవర్గంలో జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు బీసీలంతా కృషి చేయాలని కోరారు. త్వరలో ఆదోనిలో జ్యోతిరావు పూలే విగ్రహవిష్కరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు కొంకతి లక్ష్మినారాయణ, ఎల్వీప్రసాద్‌, పి. విజయకుమార్‌, రామాంజనేయులు, అశోక్‌కుమార్‌ యాదవ్‌, నంది మధుసూదన్‌నాయుడు, కేవీ మఽఽధు, బీసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 10:56 PM