ఘనంగా భీష్మ ఏకాదశి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:21 AM
: పట్టణంలోని తెలుగు వెంకటరమణ ఇంటి ఆవరణలో భీష్మ ఏకాదశిని గురువారం ఘనంగా నిర్వహించారు
బేతంచెర్ల, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని తెలుగు వెంకటరమణ ఇంటి ఆవరణలో భీష్మ ఏకాదశిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీష్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి గంగపుత్ర సంఘం నాయకులు నివాళులర్పించారు. తెలుగు వెంకటరమణ కుమారుడు మేఘ శ్యామ్‌కు కర్నూలు మెడికల్ కాలేజిలో ఎండీ సీటు దక్కించుకొనడంతో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమానికి సమరత సేవా ఫౌండేషన జిల్లా కన్వీనర్ నాగమోహన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. మహాభారత సంగ్రామంలో ధర్మం కోసం భీష్ముడు ప్రాణ త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర నాయకులు ఎల్లయ్య, మద్దిలేటి, గంగన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.
చాగలమర్రి: స్థానిక చెన్నకేశవ, రామలింగేశ్వర, సాయిబాబా ఆలయాల్లో గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభి షేకాలు చేశారు. రామలింగేశ్వర ఆలయంలో శివమాలధారులు విష్ణుస హస్త్ర పారాయణం, పల్లకి ఉత్సవం చేశారు. నరసింహస్వామి భక్తులు చెన్నకేశవ స్వామికి పూజలు చేశారు. సాయిబాబా ఆలయంలో వేద పం డితుడు పెద్దశాస్త్రీ ఆధ్వర్యంలో వతం, భీష్మ ఏకాదశి పూజలు నిర్వహించారు.
కొలిమిగుండ్ల: స్థానిక షిరిడీ సాయిబాబా ఆలయం, బెలుం శ్రీకృష్ణ మందిరంలోనూ గురువారం భీష్మ ఏకాదశి పూజలు నిర్వహించారు. రాత్రి బాబా పల్లకీ ఉత్సవం నిర్వహించారు. కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు