Share News

భానుడి భగభగలు

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:11 PM

రోజురోజుకూ భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్య ప్రతాపంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు.

భానుడి భగభగలు
టెక్కె మార్కెట్‌యార్డు వద్ద నిర్మానుష్యంగా ప్రధాన రహదారి

నంద్యాల జిల్లా సంజామలలో 44.8 డిగ్రీలు

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 43.6 డిగ్రీలు నమోదు

ఏప్రిల్‌ 19 నుంచి మే 31 వరకు మరింత తీవ్రం

కర్నూలు అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్య ప్రతాపంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా సంజామల మండలంలో 44.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్ర త నమోదైంది. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నం ద్యాల జిల్లాలో సంజామల తర్వాత బనగానపల్లె, ఆళ్లగడ్డలో 44.5, రుద్రవరం 43.7, కొత్తపల్లె 43.6, నంద్యాలరూరల్‌ 43.5, చాగలమర్రి 43.4, కోవెలకుంట్ల 43.3, దొర్నిపాడు 43.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలో వెల్ధుర్తి తర్వాత మంత్రాలయంలో 43.5, గూడూరు, కల్లూరు 43.1, చిప్పగిరి 43.0, కోసిగి 42.6, కౌతాళం 42.5, పెద్దకడబూరు, నందవరం, ఎమ్మిగనూరు మండలాల్లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌ 19 నుంచి మే 31 వరకు మరింతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపాయి.

Updated Date - Apr 17 , 2026 | 11:11 PM