క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:32 AM
: క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య వి.వెంకట బసవరావు అన్నారు.
ఆర్‌యూ వైస్ చాన్స్‌లర్ వెంకట బసవరావు
కర్నూలు స్పోర్ట్స్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య వి.వెంకట బసవరావు అన్నారు. బుధవారం ఉస్మానియా కళాశాలలో ఆర్‌యూ అంతర్‌కళాశాలల బ్యాడ్మింటన్ టోర్నమెంట్- 2026ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడుతూ గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని, క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఉందన్నారు. రిజిస్ర్టార్ డా.బి.విజయకుమార్ నాయుడు, ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ ఆజ్రాజావేద్, ప్రిన్సిపాల్ సయ్యద్ సమీవుద్దీన్, ముజామిల్, గేమ్స్ కోఆర్డినేటర్ డా.కేవీ శివకిషోర్, పీడీ ప్రకాశం, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.