Share News

మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:47 AM

మిషన్‌ శక్తి పథకం కింద వన్‌ స్టాప్‌ సెంటర్‌ ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందిం చాలని కలెక్టర్‌ ఎ.సిరి సూచించారు.

మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌
వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మిషన్‌ శక్తి పథకం కింద వన్‌ స్టాప్‌ సెంటర్‌ ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందిం చాలని కలెక్టర్‌ ఎ.సిరి సూచించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియం ఆవరణలో మిషన్‌ శక్తి పథకం కింద జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్‌ స్టాప్‌ సెంటర్‌ (సఖీ కేంద్రం)కు సంబంధించిన వాహనాన్ని సోమవారం కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లా డుతూ మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, వేధింపులు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులకు తక్షణ సాయం, రక్షణ, అవసరమైన సేవలు అందించడం కోసం ఈ వాహనం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయ, వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మిన్‌ మేరీ స్వర్ణలత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:47 AM