Share News

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:37 PM

ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటి కప్పుడు పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలందించాలి
అర్జీలను స్వీకరిస్త్తున్న మంత్రి బీసీజనార్దన్‌రెడ్డి

సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటి కప్పుడు పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల అ ర్జీలను మంత్రి స్వయంగా స్వీకరించారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. రెవెన్యూ, ఇతర సమస్యలను అధికా రులు కార్యాలయాల చుట్టూ తిప్పకుండా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్జీలను పరిష్కరించడానికి కృషిచేసిన మంత్రి బీసీని ప్రజలు అభినందించారు.

Updated Date - Sep 13 , 2026 | 11:37 PM