Share News

మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:36 AM

ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బందిని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదేశించారు.

మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్‌
రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి

గూడూరు, జూన 11 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బందిని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదేశించారు. గూడూరులోని 4, 6వ స్వర్ణ వార్డు కార్యాల యాలను కలెక్టర్‌ తనిఖీ చేసి అక్కడ సిబ్బంది అందిస్తున్న సేవలు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఇందులో భాగంగా మహిళా పోలీ సులు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. గుడ్‌ టచ - బ్యాడ్‌ టచ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎంత మందికి అవగాహన కల్పించారో, వార్డు పరిఽధిలో ఉన్న మైనర్‌ బాలికల సంఖ్య ఎంత, వారికి సంబంధించిన రికార్డులు ఎందుకు నిర్వహించలేదని మహిళా పోలీసులను ప్రశ్నించారు. మైనర్‌ బాలికలకు సంబంధించి సమగ్ర రికార్డులను తప్పనిసరిగా నిర్వహించి వారి విద్య, ఆరోగ్యం, భద్రత అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు ఏఐ ఆధారిత ఈసీడీ స్కీనింగ్‌, చిన్నారుల ఆరోగ్య, అభివృద్ధి లోపాల గుర్తింపు, బాల్య వివాహాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక శిక్షణా కార్యక్ర మాలు నిర్వహించాలని స్వర్ణగ్రామ, వార్డు అధికారి బాస్కర్‌ నాయుడు ను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే శాస్త్రీయ పద్ధతుల్లోనే చెత్త నిర్వహణ చేపట్టాలని, వర్మీకంపోస్టు తయారీ నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఆర్డీవో సందీప్‌ కుమార్‌, స్వర్ణగ్రామ, వార్డు అధికారి భాస్కర్‌ నాయుడు, డీపీవో భాస్కర్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌, కమిషనర్‌ రమేష్‌ బాబు, ఏవో దస్తగిరి రెడ్డి ఉన్నారు.

పారదర్శకంగా ఎరువులు సరఫరా చేయాలి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఎరువులు సరఫరా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఏపీఐఎంఎస్‌ యాప్‌ ద్వారా రైతుల వివరాలను ఏ విధంగా నమోదు చేసి యూరియా సరఫరా చేస్తున్న ప్రక్రియను కలె క్టర్‌ స్వయంగా పరిశీలించి, తగు సూచనలు చేశారు.

పాడి పశువుల పెంపకంపై దృష్టి పెట్టాలి

కర్నూలు అగ్రికల్చర్‌: రైతులు పాడి పశువుల పెంపకంపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న పశువుల సమూహం పునరు త్పత్తి పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ పాల ఉత్పత్తిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఇందు కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను లాభాల బాట పట్టించేందు కోసం వివిద పథకాలు, కార్యక్రమా లను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ జేడీ రాజ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:36 AM