ప్రయాణికులకు మెరుగైన సేవలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:52 PM
ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ మరింత మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తుందని కడప జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవకుమార్ పేర్కొన్నారు.
కడప జోన్ ఈడీ రాఘవకుమార్
ఆదోని అగ్రికల్చర్/ ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ మరింత మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తుందని కడప జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవకుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఆదోని, ఎమ్మి గనూరు ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను ఆర్టీసీ బస్టాండ్, క్యాంటీన్ పరి శీలించారు. ఆదోని క్యాంటీన్ చుట్టూ వర్షం పడితే నీరు చేరుతుం దని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చుట్టూ నీరు నిలిచిపో తుందని క్యాంటీన్ నిర్వాహకుడు ఈడీ దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్బం దులు కలగకుండా, డ్రైనేజీని ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్‌కు ఆదేశించారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేశామని తెలిపారు. ఆర్‌ఎం శ్రీని వాసులు, డీఎంలు మద్దిలేటి నాయుడు, మహమ్మద్ రఫి ఉన్నారు.