భక్తులకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:46 PM
నల్లమలలో కొలువైన కొలనుభారతిలో ఈ నెల 23న జరిగే వసంత పంచమి వేడుకల్లో పాల్గొనే భక్తులకు మెరుగైన సేవలందించాలని నందికొ ట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆయా శాఖ అధికారులను ఆదేశించారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య
23న వసంత పంచమి
కొత్తపల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): నల్లమలలో కొలువైన కొలనుభారతిలో ఈ నెల 23న జరిగే వసంత పంచమి వేడుకల్లో పాల్గొనే భక్తులకు మెరుగైన సేవలందించాలని నందికొ ట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కొలను భారతి క్షేత్ర ప్రాంగణంలో శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావుతో కలిసి ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులతో వసంత పంచమి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే, శ్రీశైలం ఈవోకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ కొలనుభారతి క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో విలీనం చేశాక మొదటిసారిగా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. వసంత పం చమికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికా రులు భక్తులకు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా సహకరించాలని కోరారు.
భక్తులు ఇబ్బంది పడకూడదు
వసంత పంచమి వేడుకలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదని శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు దేవదాయ శాఖ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 23న తెల్లవారుజామునే అమ్మవారికి శ్రీశైలం నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. ఆరోజు క్షేత్ర ప్రాంగణంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు, కాశిరెడ్డినాయన ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. ఆత్మకూరు, నంది కొట్కూరు నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సును కూడా ఏర్పాటుచేస్తున్నామన్నారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి మోహన్, విద్యుత్ శాఖ ఏడీ రామసుబ్రహ్మణ్యం, సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఈవో రామలింగారెడ్డి, తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీవో మేరీ, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.