ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:33 PM
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
గోస్పాడు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం మండలంలోని జూలేపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణులు చిన్నచిన్న వ్యాధులకు ప్రాథమిక పరీక్షల నిమిత్తం పట్టణాలకు వెళ్లకుండా గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య హెల్త్ క్లీనిక్‌లను ఏర్పాటు చేస్తోందన్నారు. రూ35లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసేందుకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కాటంరెడ్డి తులసీశ్వర్ రెడ్డి, దీబగుట్ల సొసైటీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, నీటి సంఘాల నాయకులు ఇలియాజ్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.