Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:24 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు
గ్యాస్ర్టో ఎంట్రాలజి విభాగంలో మోనోమెట్రిని ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం ఉద యం జీజీహెచ గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగంలో రూ.29.30 లక్షల విలు వైన హైరిజల్యూన ఎసోపగిల్‌ మోనోమెట్రి పరికరాలను మంత్రి, హాస్పి టల్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మోనోమెట్రి ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేదన్నారు. జీజీహెచ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు మాట్లాడు తూ 50 ఏళ్లు నాటి ఆసుపత్రి భవనాలు వర్షం నీటితో కారుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లగా తన స్వంత నిధులు రూ.2.50 కోట్లతో మరమ్మతులు చేయించారన్నారు. కార్యక్రమంలో గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగపు హెచవోడీ డా.జి.మోహన రెడ్డి, సీనియర్‌ గ్యాస్ర్టో ఎంట్రాల జిస్టు డా.బి.శంకర్‌శర్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.డి.శ్రీరాములు, హెచడీఎస్‌ సభ్యులు సాయిప్రదీప్‌, డా.ప్రవీణ్‌ పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతలో భాగస్వాములు కావాలి

కర్నూలు న్యూసిటీ: పరిసరాల శుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పిలుపుని చ్చారు. గురువారం సంకల్‌బాగ్‌ తుంగభద్ర నది ఒడ్డున స్వచ్ఛతా హి సేవా-2026లో భాగంగా ‘ఒక్కరోజు-ఒక్క గంట-ఒకేతాటిపై’ (ఏక్‌దిన- ఏక్‌ఘంటా- ఏక్‌సాథ్‌ కార్యక్రమం నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసుతో కలిసి మంత్రి టీజీ భరత చీపురు పట్టుకు ని పరిసరాలను శుభ్రం చేశారు. టీజీ భరత మాట్లాడుతూ పరిశుభ్రత కేవలం పారిశుధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాగస్వామిగా మారినప్పుడే పరిశుభ్రమైన నగరం సాధ్యమవుతుందని అన్నారు. కమిషనర్‌ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరాన్ని పరి శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అఽధికారి డా.ఎం. రఘు, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ పవన కుమార్‌రెడ్డి, ఏఈ వైష్ణవి, శానిటరీ సూపర్‌వైజర్‌ రమేష్‌బాబు, ఇనస్పె క్టర్‌ మల్లికార్జున, స్వచ్ఛ సర్వేక్షన కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:24 AM