Share News

వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:27 PM

వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి వార్డెన్‌ బాద్యత అని జిల్లా కలెక్టర్‌ సిరి పేర్కొన్నారు.

వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి

కలెక్టర్‌ సిరి

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి వార్డెన్‌ బాద్యత అని జిల్లా కలెక్టర్‌ సిరి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు, హాస్టల్‌ వార్డెన్లతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో నాణ్యత, క్రమశిక్షణ, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ ఎన్‌వీ లోక్‌రాజ్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ప్రసూన, మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సబీహా పర్వీన్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్‌, సాంఘీక సంక్షేమ శాఖ అధికారి రాధిక, వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:27 PM