Share News

కఠోర సాధనతో ఉత్తమ ఫలితాలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:28 PM

క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడల్లో కఠోర సాధన చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్‌ అన్నారు.

కఠోర సాధనతో ఉత్తమ ఫలితాలు
ప్రారంభిస్తున్న అధికారులు

సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్‌

జిల్లా స్థాయి శాప్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ పోటీలు ప్రారంభం

కర్నూలు స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడల్లో కఠోర సాధన చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్‌ అన్నారు. గురువారం గార్గేయపురం సిటీ ఫారెస్ట్‌ వద్ద ఉన్న నగరవనం చెరువులో జిల్లా స్థాయి శాప్‌ లీగ్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రాష్ట్ర డ్రాగన్‌ బోట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అవినాష్‌ గుప్తా, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం కోశాధికారి డా. రుద్రరెడ్డి, వాటర్‌ స్పోర్ట్స్‌ కోచ్‌ చంద్రశేఖర్‌తో కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. వేణుగోపాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచిందన్నారు. డీఎస్‌డీవో భూపతిరావు మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 11 నుంచి 12 వరకు ఎన్టీఆర్‌ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి శాప్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ లీగ్‌ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిఽథ్యం వహిస్తారన్నారు. అవినాష్‌ గుప్తా మాట్లాడుతూ పోటీలకు సంబంధించి టెక్నికల్‌ సపోర్ట్‌ను అందించారన్నారు. డీఎస్‌ఏ ఫెన్సింగ్‌ శిక్షకుడు మహేశ్వరరావు, జిమ్నాస్టిక్స్‌ శిక్షకుడు పవన్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 11:28 PM