బహుళ పంటల సాగుతో లాభాలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:26 PM
బహుళ పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): బహుళ పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉల్లి సాగుకు సమాయత్తం అయ్యే రైతన్న పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గత ఏడాది ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సీజన్‌లో రైతులు అధికంగా ఉల్లి పంట సాగు చేశారన్నారు. అధిక వర్షాలతో గడ్డల పరిమాణం తగ్గడంతో పాటు అవి కుల్లిపోవడం వల్ల దిగుబడి తగ్గి సమస్యలు రైతుల నెత్తిన పడ్డాయన్నారు. ఉల్లికి బదులుగా బహుళ పంటల విధానాన్ని ఎంచు కోవాలని, ఈ విష యాన్ని రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీదే అని వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉల్లి రైతులకు అవగాహన కల్పించేలా ఉద్యానశాఖ ముద్రించిన ఒక చిన్నమాట అనే పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్క రించారు. ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.