ఘనంగా బళ్లారి రాఘవ జయంతి
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:22 AM
జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు సెట్కూరు వారి ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో తెలుగు నాటకరంగ పితామహుడు, మహానటుడు బళ్లారి రాఘవ జయవంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు సెట్కూరు వారి ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో తెలుగు నాటకరంగ పితామహుడు, మహానటుడు బళ్లారి రాఘవ జయవంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బళ్లారి రాఘవ చిత్రపటానికి ముఖ్యఅతిథులు పూలమాలలు వేసిన నివా ళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ మాట్లా డుతూ బళ్లారి రాఘవ కళను సమాజ చైతన్యానికి సాధనంగా మలిచిన మహోన్నత వ్యక్తి ఓబులయ్య మాట్లాడుతూ బళ్లారి రాఘవ కేవలం నటుడు మాత్రమే కాదని, తెలుగు సంస్కృతికి జీవం పోసిన మహాను బావుడని కొనియాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కనుసుకర కిరణ్, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్ పాల్గొన్నారు.