అటవీ సంరక్షణలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:10 AM
అటవీ సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టరు చైతన్యకుమార్‌రెడ్డి అన్నారు.
టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టరు చైతన్యకుమార్‌రెడ్డి
రుద్రవరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : అటవీ సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టరు చైతన్యకుమార్‌రెడ్డి అన్నారు. రుద్రవరం రేంజ్‌లోని శీతల్ బేస్ క్యాంపు వద్ద గురువారం ప్రొటెక్షన్ వాచర్లు, అటవీ అధికారులు, దేవాలయ సిబ్బందితో బ్రిక్స్ కార్యక్రమంలో భాగంగా జీవనశైలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్లమల అడవిలోని దేవాలయాలకు వచ్చే భక్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని సూచించారు. నీటిని వృథా చేయకూడదని సూచించారు. క్లాత్ బ్యాగ్, పేపరు కవర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రేంజర్ ముర్తుజావలి, డిప్యూటీ రేంజర్ అన్వర్‌హుస్సేన్, అహోబిల దేవస్థానం సీఈవో రంగరాజన్, సెక్షన్ ఆఫీసర్లు మహబూబ్‌ఖాన్, రామకృష్ణ, శ్రీనివాసులు, జేమ్స్‌పాల్, బీట్ ఆఫీసర్లు నాగహుస్సేనయ్య, నరసింహారెడ్డి, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.