రమణీయం.. యాగంటీశ్వరుడి రథోత్సవం
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:36 AM
మండలంలోని ఎన.కొంతల పాడులో యాగంటీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్లవారు జామునస్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది.
భారీగా తరలివచ్చిన భక్తజనం
ఓర్వకల్లు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎన.కొంతల పాడులో యాగంటీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్లవారు జామునస్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగిస్తూ రథంపైకి చేర్చారు. స్వామివారికి అర్చకులు ఉరుకుందయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వాముల వారిని పల్లకి లో నందికోల సేవతో ఊరేగించారు. రథాన్ని ఆలయం ముందు నుంచి గ్రామం వరకు లాగి యథాస్థానంలో నిలిపారు. అనంతరం భక్తులు రథానికి, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సీఐ చల్లని దొర, ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, టీడీపీ మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, గ్రామ పెద్దలు చంద్రశేఖరప్ప, చంద్రసే నారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగ కుండా సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆధ్వర్యం లో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎన. కొంతల పాడు లో నిర్వహించిన సినీ సంగీత విభావరి అందరిని అలరించింది. ఆర్కెస్ర్టా శ్రీకృష్ణ ఈవెంట్స్ వారిచే రేలారేలారే శ్రీను, జబర్దస్త్ వినోద్, లాస్య, మనోహర్, ఉమేష్, యాంకర్ కవిత, కృష్ణలు పాడిన జానపద గీతాలు, సంగీ త పాటలు భక్తులను ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి మాట్లా డుతూ ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. కార్యక్ర మంలో టీడీపీ మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు గోవిందరెడ్డి, నాయకులు విశ్వే శ్వరరెడ్డి సీఎన సుధాకర్ రెడ్డి, మోహన రెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖరప్ప, సీఐ చల్లని దొర, పెరుగు పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.