Share News

రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:50 PM

రామలింగేశ్వరస్వామి మహా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
రామలింగేశ్వర మహారథం ఊరేగుతున్న దృశ్యం

మంత్రాలయం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రామలింగేశ్వరస్వామి మహా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శక్రవారం మంత్రాలయం మండలంలోని రాంపురంలో తుంగభద్ర నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం ఆంరఽధా, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాంపురం రెడ్డి సోదరులు, ఆలయ ధర్మకర్తలు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సీతారామిరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే వైసీజీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మంచాల సొసైటీ మాజీ అధ్యక్షుడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్‌ రెడ్డి, భీమా యూత్‌ ఽనాయకులు ధరణిధర్‌ రెడ్డి, భీమారెడ్డి, మనోజ్‌రెడ్డి, నైరుతిరెడ్డి, ఆంరఽధా, కర్ణాటక వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులను ప్రత్యేక వాహనంపై ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. రాంపురం రెడ్డి సోదరులు ఇంటి నుంచి ఉత్సవమూర్తి ఆలయం వరకు చేరుకుని అక్కడ పూజలు చేసి మహారథంపై ఏర్పాటు చేశారు. ఉత్సవమూర్తిని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, అర్చకులు తలపై పెట్టుకుని మోసుకువస్తున్న దృశ్యం ఆకట్టుకుంది. మహారథం ముందుకు సాగుతుండగా.. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చు కున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, గుంతకల్లు, ఉరవకొండ, రాయచూరు, మాన్వి, సిందనూరు, అయిజ, గద్వాల నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులు రాంపురం సోదరులను ఘనంగా సన్మానించారు. మంత్రాలయం, కోసిగి, కౌతాళం సీఐ రామాంజులు, మంజునాథ్‌, అశోక్‌, మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయ కుమార్‌, మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jan 16 , 2026 | 11:51 PM