రమణీయం.. మల్లన్న వెండి రథోత్సవం
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:38 PM
శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సోమవారం వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీగిరి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు సోమవార ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.
శ్రీశైలం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సోమవారం వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీగిరి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు సోమవార ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం ప్రాకారంలోని పురాతన రాతిమండపంలో పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులుజేసి షోడశోపచార పూజాక్రతువులతో పాటు వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించి సహస్త్ర దీపార్చన నిర్వహించారు. ఆ తర్వాత అర్చక వేదపండితులు వెండి రథంపై స్వామి, అమ్మవార్ల కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు.