Share News

రమణీయం.. చౌడేశ్వరి రథోత్సవం

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:07 AM

నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరి దేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు.

రమణీయం.. చౌడేశ్వరి రథోత్సవం
తిరుణాల సందర్భమగా రథాన్ని లాగుతున్న భక్తులు

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

బనగానపల్లె, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరి దేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5గంటల సమయంలో ఆలయ చైర్మన్‌ రామసేతు నాగార్జునరెడ్డి, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పీవీ.కుమార్‌రెడ్డి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రథంపై శ్రీచౌడేశ్వరీమాత అమ్మవారి ఉత్సవమూర్తులను కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాల, మేళతాళాల మధ్య అధిక సంఖ్యలో భక్తులు చౌడేశ్వరిదేవిని స్మరిస్తూ రథాన్ని లాగుతూ ఆలయం వద్ద చేరుకోవడంతో రథోత్సవం ముగిసింది.

Updated Date - Mar 25 , 2026 | 12:07 AM