స్మృతివనం సమీపంలో...ఎలుగుబంటి
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:20 AM
వైఎ్‌సఆర్ స్మృతివనం సమీపంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. బుధవారం అటవీ ప్రాంతం నుంచి నంద్యాల ప్రధాన రహదారిపైకి ఒక్కసారిగా ఎలుగు బంటి రావడంతో అటుగా వెళుతున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆత్మకూరురూరల్ , జూన్ 3 ( ఆంధ్రజ్యోతి): వైఎ్‌సఆర్ స్మృతివనం సమీపంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. బుధవారం అటవీ ప్రాంతం నుంచి నంద్యాల ప్రధాన రహదారిపైకి ఒక్కసారిగా ఎలుగు బంటి రావడంతో అటుగా వెళుతున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఎలుగుబంటికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని వాహనదారులను అప్రమత్తం చేశారు. ఆత్మకూరు నంద్యాల ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.