Share News

గోదాముల వద్ద అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 22 , 2026 | 11:08 PM

ఈవీఎం గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజకుమారి హెచ్చరించారు.

గోదాముల వద్ద అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం గోదాము వద్ద కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ఈవీఎం గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజకుమారి హెచ్చరించారు. శుక్రవారం నంద్యాల టెక్కె మార్కెట్‌యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాముల డోర్‌ లాక్‌ సీళ్లను, రక్షణ చర్యలను ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించారు. పోలీస్‌ లాగ్‌బుక్‌ను పరిశీలించి విధుల నిర్వహణపై ఆరాతీశారు. సీసీ టీవీ పర్యవేక్షణ పర్య వేక్షణ స్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశిం చామన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌వో రామునాయక్‌, ఆర్డీవో విశ్వనాధ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎన్నికల డీటీ మనోహర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 11:08 PM