Share News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:06 PM

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ యుగంధర్‌బాబు (అడ్మిన్‌) అన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆయుధాల పనితీరుపై వివరిస్తున్న పోలీసులు

ఏఎస్పీ యుగంధర్‌బాబు

నంద్యాల క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ యుగంధర్‌బాబు (అడ్మిన్‌) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వేడుకల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాల యం ఆవరణలో శుక్రవారం ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని గురురాజా, భాష్యం, నలంద, చైతన్య పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసులు రోజువారీ విధుల్లో భాగంగా ఉప యోగించే ఆయుధాలను ప్రదర్శించి వాటి పనితీరుపై వివరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శక్తిటీమ్‌ సభ్యులు సందర్శించి శక్తియాప్‌ ప్రాముఖ్యత, ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. మహిళా పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక ్టర్‌ జయరామ్‌, రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ మంజునాథ్‌, ఆర్‌ఎస్‌ఐ ఉమామహేశ్వరరెడ్డి, శ్రీని వాసులు, ఏఆర్‌, మహిళా పోలీసుస్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 11:06 PM